సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేసిన అగ్నిపత్ పథకంలో భాగంగా ఆర్మీ లో చేరేందుకు ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్ ఆర్మీ అధికారులు ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తు ప్రారంభం తేదీ ఆగస్టు 05 తేదీ నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వయసు అక్టోబర్ 01 తేదీ నాటికి 23 ఏళ్లు ఉండాలి 23 ఏళ్ల పైబడి దాటిన వాళ్లకి దరఖాస్తు చేసేందుకు లేదు. 

అర్హత టెన్త్ పాస్ అయి ఉండాలి, అక్టోబర్ 15వ తారీకు నుంచి 31 వరకు సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో ఈ పథకం కింద రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తారు.

అగ్నిపత్ పథకం: యువత ఆందోళనలు చేపట్టినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం వెనక్కి తగ్గలేదు.ఇకనుండి అగ్నిపత్ స్క్రీన్ ద్వారానే రిక్రూట్మెంట్ జరుగుతుంది.

సాధన రిక్రూట్మెంట్ ర్యాలీ ఉండవని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకోవాల్సిన సైట్ www.joinindianarmy.nic.in.

దేశం కోసం సేవ చేసేందుకు ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అగ్నిపత్ నావి కి భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. 

సూర్యాపేట లో జరగనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు.

జనరల్ డ్యూటీ, టెక్నికల్ క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, ట్రేడ్స్‌మన్‌కు 8వ తరగతి విద్యార్హత ఉండాలి.